●వృషభ రాజసం
విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో ఓ వృషభ రాజు రికార్డు సృష్టించింది. గ్రామానికి చెందిన అనంతయ్య అనే రైతుకు చెందిన బాహుబలి వృషభరాజు 7.5 టన్నుల బరువు గల జొన్నల బస్తాలను ఒకేసారి కిలోమీటరు దూరం లాగి అబ్బురపరిచింది. ఐదు ఎడ్ల
బండ్లలో నింపిన 103 బస్తాల జొన్నలను వృషభరాజు అవలీలగా లాగడంతో రైతులు ‘జై బాహుబలి... జై జై బాహుబలి’ అంటూ
ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అనంతరం రికార్డు సృష్టించిన వృషభాన్ని గ్రామంలో ఊరేగించారు. –ఉరవకొండ(విడపనకల్లు)
Comments
Please login to add a commentAdd a comment