ఉరవకొండ: మండలంలోని వెలిగొండ గ్రామ సర్పంచ్ వీరాంజి ఇంటిపై అదే గ్రామానికి చెందిన పర్తప్ప కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేశారు. సర్పంచ్ సోదరుడు నాగప్ప కుమారుడు శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... సోమవారం సర్పంచ్ వీరాంజి ఇంటి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచిన విషయంగా అదే గ్రామానికి చెందిన గుడిసెల పర్తప్ప, చంద్రశేఖర్, నీలకంఠ, చెన్నకేశవులు, సుంకప్ప, సిద్దప్ప, సునీత, మంగమ్మ గొడవకు దిగి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఘటనలో సర్పంచ్ వీరాంజి భార్య లక్ష్మీదేవికి బలమైన మూగదెబ్బలు తగిలాయి. గొడ్ఢళ్లతో దాడికి ప్రయత్నిస్తుంటే లక్ష్మీదేవి తప్పించుకుని పొలానికి వెళ్లి జరిగిన విషయాన్ని భర్త వీరాంజి, కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఘటనపై ఎస్‌ఐ జనార్దన్‌నాయడుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచిన తనపై పథకం ప్రకారమే దాడికి తెగబడ్డారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment