సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగా గుంటూరులో మరో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ స్థానికులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గుంటూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సీఎం భరోసా ఇచ్చారు.
గుంటూరు ఘటనపై గవర్నర్ విచారం
గుంటూరులో జరిగిన తొక్కిసలాట సంఘటన పై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరి కొందరు గాయపడటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
హోంమంత్రి తానేటి వనిత దిగ్భ్రాంతి
గుంటూరు ఘటనపై హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి వనిత మాట్లాడారు.
చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
‘క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు.. అందుకే తొక్కిసలాట’
చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు బలయ్యారు: మంత్రి రజనీ
‘చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు’
Comments
Please login to add a commentAdd a comment