సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,858 కు చేరింది. తాజా పరీక్షల్లో 25,125 పరీక్షలు ట్రూనాట్ పద్ధతిలో, 22,989 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. 2,380 మంది వైరస్ బాధితులు కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39, 935 కి చేరింది. కొత్తగా వైరస్ బాధితుల్లో 49 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 933 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,41,993 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది
Comments
Please login to add a commentAdd a comment