సాక్షి, అమరావతి : బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం వెళ్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలని తెలిపారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివస్వామి ముందుగా నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, ఏదైనా చట్టప్రకారమే జరగుతుందని అన్నారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్‌కు వెళ్తామన్నారు. ఒక కోర్టులో వ్యతిరేకంగా తీర్పు రాగానే గెలిచినట్లు కాదన్నారు. మేం ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా వెళ్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment