ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం! | MP Vijaya Sai Reddy Satirical Tweets On Chandrababu | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!

Published Sat, Jan 30 2021 1:26 PM | Last Updated on Sat, Jan 30 2021 1:26 PM

MP Vijaya Sai Reddy Satirical Tweets On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ట్విట్టర్‌ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ ‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యగ్యాస్త్రాలు సంధించారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట! అంటూ ఎద్దేవా చేశారు. ‘అధికారంలో ఉన్నప్పుడు గజం స్థలానికి టికానా లేదు. ఆ మదనపల్లి దంపతుల్లాగే సత్యలోకంలో ఉన్నాడు ఈ చంద్రగిరి నాయుడు. తన పిచ్చిని ఎల్లో కుల మీడియాకు పూర్తిగా ఎక్కించేశాడు’ అంటూ చురకలు అంటించారు. చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ!

‘‘ఏ రోటికాడ ఆ పాట - ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్విట్‌లో ఎద్దేవా చేశారు. చదవండి: యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement