గుంటూరు, సాక్షి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్ని రంగాల, వర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇచ్చారు. తాజాగా.. మత్స్యకార సంక్షేమం కోసం ఆయన ఏం చేశారనేది వివరిస్తూ.. ప్రపంచ మత్స్యకార దినోత్స శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం..
.. వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్‌లు అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన.
మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ స…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2024
Comments
Please login to add a commentAdd a comment