బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Published Fri, Sep 27 2024 3:22 AM | Last Updated on Fri, Sep 27 2024 3:22 AM

బాలల హక్కుల  పరిరక్షణ అందరి బాధ్యత

వీరబల్లి: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా బాలల రక్షణ అధికారి వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఓదివీడు పంచాయతీలోని ఎర్రంరాజుగారిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణపై గుడ్‌ నైబర్స్‌ ఏపీకోర్‌ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ హక్కుల పరిరక్షణ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.అనంతరం బాలల హక్కులు, చట్టాల గురించి విద్యార్థులకు అహగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా ఎస్‌ఐ రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోహర్‌ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్‌ నాగేశ్వర్‌, ఐసీపీయూ సిబ్బంది రవి, అడ్వకేట్‌ కౌరునీ, రమాదేవీ, బాబు తదితరులు పాల్గొన్నారు.

నర్సింగ్‌ కోర్సులో శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతులకు ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైదరాబాదులోని ప్రథమ్‌ హెల్త్‌ కేర్‌ శిక్షణ కేంద్రంలో రెండు నెలలపాటు నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్‌ సరితాసింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 18–30 ఏళ్లలోపు యువతులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, డిప్లొమా లేదా ఏదైనా ఒకేషనల్‌ కోర్సు చేసి ఉండాలన్నారు. అభ్యర్థినిలు పదవ తరగతి మార్కులిస్టు, ఆధార్‌, మూడు పాస్‌పోర్టు ఫొటోలతో అక్టోబరు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, సౌకర్యం, స్టడీ మెటీరియల్‌, ఒక జత యూనిఫారాన్ని అందజేస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థినిలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9000203952 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement