రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి

Published Thu, Oct 31 2024 2:38 AM | Last Updated on Thu, Oct 31 2024 2:38 AM

-

మదనపల్లె: పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణాలు నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె మండలంలోని వైఎస్సార్‌ కాలనీ, బాబూకాలనీలోని సీసీ రోడ్డు పనులను కలెక్టర్‌, ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పటిలోగా పూర్తిచేయాలి? నిధుల కేటాయింపు, పనులనాణ్యత తదితర అంశాలపై అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్‌సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే వినతిమేరకు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి సీటీఎం రోడ్డు వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement