No Headline
అభిమాన నాయకుడితో మాట్లాడాలని కార్యకర్తలు... పంట నష్టాల గురించి చెప్పుకోవాలని రైతులు.. ఓ సారి కలిసి కష్టాలు పంచుకోవాలని ప్రజలు.. రాష్ట్ర నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చారు. వెరసి పులివెందులలోని భాకరాపేట క్యాంపు కార్యాలయం జనసంద్రమైంది.
ఆయనా అంతే.. ప్రతి ఒక్కర్నీ ప్రేమగా పలకరించారు. ఆత్మీయ కరచాలనం చేశారు.. భుజంపై చేయి వేసి గుండె నిండా ధైర్యమిచ్చారు. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ మంచి రోజులొస్తాయని కొండంత భరోసా ఇచ్చారు. తన కోసం శ్రమకోర్చి వచ్చిన ప్రజలతో మాజీ సీఎం
వైఎస్ జగన్ మమేకమైన తీరిది.
● నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ పలకరింపు
● కష్టాలు తాత్కాలికమేనంటూ రైతులకు భరోసా
● సమీప బంధువులతో ముచ్చట
● నూతన జంటలకు ఆశీర్వాదం
● పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయం రోజంతా సందడిగా మారింది. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు మాజీ నేతలతో పలువిషయాలు చర్చించారు. అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రతీ కార్యకర్తకు ఆయా నేతలు అండగా నిలవాలని ఆదేశించారు.
బంధువులతో సమావేశం...
వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగు సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర రెడ్డి, వైఎస్ మధురెడ్డి తదితరులతోపాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరో సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. అలాగే దొండ్లవాగు వైఎస్సార్‌సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం కాగా, ఆయన ఇంటికి వెళ్లి నూతన జంట మాధురీ, నరేంద్రరెడ్డిలను ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్‌బీ అంజాద్ బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సాయినాథశర్మ తదితరులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా నేతలకు తగు సూచనలు చేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని ఆదేశించారు. కష్టకాలంలో పార్టీకోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment