దివ్యకాంతుల దీపావళి
మదనపల్లె సిటీ: జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. కొత్త దుస్తులు, టపాకాయలు, లక్ష్మిపూజకు కావాల్సిన సరంజామ కొనుగోలు చేసే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. ఏటా ఆశ్వయుజమానం అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏట దీపావళి గురువారం మధ్యాహ్నం 2.47కు ప్రారంభమై శుక్రవారం సాయంత్రం 4.50 వరకు ఉంటుంది. 31వతేదీ సాయంత్రం దీపావళి ధనలక్ష్మి పూజ చేయుటకు శుభప్రదంగా ఉంటుంది.
పూజ, వస్త్ర దుకాణాలు కిటకిట:
జిల్లా వ్యాప్తంగా పండుగ శోభ నిండింది. ఈ నేపథ్యంలో మదనపల్లె, రాయచోటి, రాజంపూట, పీలేరు, వాల్మీకిపురం, రైల్వేకోడూరులతో పాటు పలు మండల కేంద్రాలోల దుకాణాలోల జనం కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకంగా పండుగ కోసం పూజా సామగ్రి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక వస్త్ర దుకాణాలోల సందడి నెలకొంది.
జోరుగా బాణసంచా విక్రయాలు
ఈసారి దీపావళి పండుగ వేళ బాణసంచా దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జనం టపాసులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
పూల ధరలకు రెక్కలు:
దీపావళి పండుగను పురస్కరించుకుని పూలమార్కెట్లు కిటకిటలాడాయి. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండు, మున్సిపల్ కార్యాలయం, చిత్తూరు బస్టాండు, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, నీరుగట్టువారిపల్లె ప్రాంతాల్లో అరటి, మామిడి ఆకుల అమ్మకాలు ఊపందుకున్నారు. పూల మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పూలు ధరలకు రెక్కలొచ్చాయి. మల్లెపూలు కిలో రూ.800 పలికాయి. దీంతో పాటు బంతి,చామంతి,రోజా పూలు ధరలు రెట్టింతలయ్యాయి. దుకాణాల్లో పూజల కోసం బూడిదగుమ్మడికాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. మట్టి దీపాలు, ప్రమిదలతో పాటు క్యాండిల్స్ దీపాలు అమ్మకాలు జోరుగా సాగాయి.
విజయానికి ప్రతీక
చీకటిని తరిమి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి. విజయానికి ప్రతీక. పల్లె నుంచి నగరాల వరకూ ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు, నూతనవస్త్రాల రెపరెపలు, చెవులు చిల్లు పడేలా బాణసంచాల ధ్వనులు, ఆ బాలగోపాలం ఆనంద డోలికల్లో తేలియాడే పండుగే ఈ దీపావళి. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ శోభ సంతరించుకుంది.
పూజ సామగ్రి, వస్త్ర దుకాణాలు కిటకిట
పూల ధరలకు రెక్కలు
జోరుగా బాణ సంచా విక్రయాలు
దీపలక్ష్మీ నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం సర్వతమోవహం.దీపేన సాధ్యతే సర్వమ్ దీపలక్ష్మి నమోస్తుతే. సకల జ్ఞానానికి బ్రహ్మ అధిపతి. దీపం సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం.అది సకల తమో గుణాలనూ హరిస్తుంది. ఏ ఇంటిలో దీపాలు సమృద్దిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని వేదాలు చెబుతున్నాయి. దీపావళి రోజు సాయంసంధ్యాకాలంలో లక్ష్మి కోట ముందు మొదట దీపాలు వెలిగించి, మహాలక్ష్మిని అష్టోత్తరాలతో పూజించి నివేదిస్తే పుణ్యం లభిస్తుంది.
–శివకుమార్‌శర్మ, వేదపండితులు, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment