నేడు రూటా ప్రాంతీయ సదస్సు
మదనపల్లె సిటీ: రాష్ట్ర ఉర్దూ టీచర్ల సంఘం (రూటా) ప్రాంతీయ సదస్సును గురువారం స్థానిక ఉర్దూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఏ.షాజహాన్, జిల్లా ప్రతినిధులు సిబాతుర్ రహ్మాన్, ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ అనంతరం సంఘం ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఉర్దూ ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు.
నవోదయ ప్రవేశాలకు గడువు పొడిగింపు
రాయచోటి (జగదాంబసెంటర్): నవోదయ ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు మదనపల్లె మండలం వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ టి.వేలాయుధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ –2025కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9వ తేదీ వరకు గడువు పొడిగించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదువుతూ 9వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. వివరాలకు 8919956395, 7013201138 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆలయాల వద్ద సీసీ
కెమెరాలు తప్పనిసరి
గుర్రంకొండ: దేవాలయాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథం రాజు అన్నారు. బుధవారం ఆయన గుర్రంకొండలో పర్యటించారు. ఈసందర్భంగా రెండు రోజుల క్రితం చోరీ జరిగిన శ్రీ వోనీ ఆంజినేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ, శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయాలను కూడా సందర్శించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ గుర్రంకొండలో వరుసగా దేవాలయాల్లో చోరీలు జరుగుతుండడం బాధకరమన్నారు. చోరీలు జరిగిన ఆలయాలకు సంబంధించి పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదు చేయించామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేదిలేదన్నారు. ఆయన వెంట ఈఓ బాలకృష్ణ, అర్చకులు కిరణ్‌కుమార్‌శర్మ, మండల బీజేపీ అధ్యక్షుడు రామాంజులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment