ఈవీఎం గోడౌన్‌పై నిరంతరం నిఘా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి: ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద 24–7 ప్రకారం నిరంతరం నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బీయూలు, సీయూలు, వివిధ ఫ్యాట్‌లను, అక్కడ భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులను అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె మధుసూదన్ రావు, ఆర్డీఓ ఏ శ్రీనివాసులు, తహసీల్దార్ పుల్లారెడ్డి, కలెక్టర్ సెక్షన్ సూపరిటెండెంట్ నరసింహకుమార్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 19 కరువు మండలాలు
అన్నమయ్య జిల్లాలో వర్షాభావ పర్థితులను పరిగణలోకి తీసుకొని 19 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి సుండుపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, తంబళ్లపల్లి, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బి కొత్తకోట, మదనపల్లి, నిమ్మనపల్లి మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment