ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శం
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి అర్బన్: మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజనశాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక డైట్ సబాభవనంలో ఇటీవల సహారా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీపరీక్షల విజేతలకు బుధవారం ఆయన నగదు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గం, ప్రేమ, శాంతి సహనం, సత్యంతో జీవితం గడపాలంటూ ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యాభివృద్ధికి సంబంధించిన పోటీపరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికితీయవచ్చునన్నారు. సహారా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆప్తాబ్ మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలోని యువతకు ఉపాధి కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఒక ఆడిటోరియం నిర్మింపచేసి సభలు, సమావేశాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ మహమ్మద్‌అలీ, ఫౌండర్ జిలాన్, ఉపాధ్యక్షుడు మొగల్ ఇలియాస్ బేగ్, సభ్యులు ఆరీఫ్, మౌలానా, సుబాన్, ఫర్జాన్, నిజాంఖాన్,నాసర్, ఇమ్రాన్, రఫాయత్, మహబూబ్‌బాష, ఉపాధ్యా యుడు అస్పాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment