పీలేరు రూరల్: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు డీఎం కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు కావల్సిన రూట్లలో, కావల్సిన రోజులు అద్దెకు బస్సులు పంపుతామని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎలాంటి ఆర్టీఓ పన్నులు లేవని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని కోరారు.
కేజీబీవీ ఉద్యోగాల
మెరిట్ లిస్ట్ విడుదల
రాయచోటి (జగదాంబసెంటర్): కేజీబీవీ పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫై చేయబడిన సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా 1:3 విధానంలో సిద్ధం చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్ https:// deoannamayya.blogspot.com/ లో పొందుపరిచామని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో తెలపాలన్నారు. అనంతరం ఈ లిస్టును ఫైనల్ లిస్టుగా ప్రకటించి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
మంత్రి కార్యాలయంలో
ప్రజా దర్బార్
రాయచోటి టౌన్: పట్టణంలో మంత్రి మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో నెలలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రజాదర్బార్ ఉపయోగపడుతుందని చెప్పారు. తాగునీరు, రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment