కూటమి సర్కార్ నిర్లక్ష్యం, అధికారపార్టీ నేతల ఆగడాలపై వివరిస్తూ వచ్చిన కేడర్‌కు మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. దౌర్జన్యాలకు జడిసే పరిస్థితి లేదని, వ్యవస్థ తన పని తాను చేసుకెళ్లాలని సూచించారు. ఎప్పుడూ కాలం ఓకేలా ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పక్షం రోజుల క్రితం పెద్దదండ్లూరు గ్రామ వైఎస్సార్సీపీ నేత హనుమంతరెడ్డిపై దాడి జరిగిందని, మళ్లీ బుధవారం హత్యాయత్నం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని పలువురు మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ ప్రమేయంతో హత్యాయత్నానికి గురైన హనుమంతరెడ్డికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు తోడ్పాటునందించాలని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఫోన్లో ఆదేశించారు. అలాగే ఆరుగాలం శ్రమించినా పంటలు గిట్టుబాటు కాలేదని పలువురు రైతులు వివరించడంతో మనోస్థైర్యం కోల్పోవద్దు, మంచిరోజులు రానున్నాయని భరోసా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment