క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
రాయచోటి : హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాయలసీమ రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్ సూచించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు పరెడ్ మైదానంలో కర్నూలు రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ హోంగార్డుల పరెడ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుశాఖలో ప్రజలకు మెరుగైన సేవలను అందివ్వాలన్నారు. ఇప్పటికే పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్న హోంగార్డుల సేవలు అభినందనీయమన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. విధులతోపాటు ఆరోగ్యానికి అధిక ప్రాదాన్యత ఇవ్వాలని సూచించారు. విధుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని పలు మెలకువలు సూచించారు. డ్రిల్, కవాతు, ప్రముఖుల బందోబస్తు, ట్రాఫిక్ తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్బీ బి చిన్ని కృష్ణ, ఏఆర్ రీజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం పెద్దయ్య, సబ్ డివిజన్ హోంగార్డ్స్ ఇన్‌చార్జీలు శ్రీనివాసులు, రమేష్,హోంగార్డ్స్ పాల్గొన్నారు.
హోంగార్డుల సేవలు అభినందనీయం
రాయలసీమ రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment