23 నుంచి రాష్ట్ర జట్టు ఎంపికకు సన్నాహాలు
మదనపల్లె సిటీ: 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ అంతర్ జిల్లాల నెట్‌బాల్ అండర్–17 బాలికల టోర్నమెంటుకు రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వసంత, టోర్నమెంటు ఆర్గనైజింగ్ చైర్మన్ ఆంజనేయులు తెలిపారు. ఈ టోర్నమెంటుకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల బాలికలు పాల్గొంటారన్నారు. ఇందులో రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయ నెట్‌బాల్ పోటీలకు పంపనున్నామని తెలిపారు.
నాణ్యమైన విద్యను అందించాలి
రాయచోటి టౌన్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం రాయచోటి డైట్ కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కేంద్రంలో కొత్తగా నేర్చుకున్న విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించాలని చెప్పారు.
బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిదీ
రాయచోటి టౌన్: బాలల హక్కులను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలో జిల్లా సీ్త్ర , శిక్షసంక్షేమశాఖ, సాధికారిత కార్యాలయం నుంచి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీ్త్ర, శిశుసంక్షేమశాఖ అధికారులు, పోలీసులు, అధికారులతో కలసి ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు తెలపాలని అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి వినోద్‌కుమార్, ఐసీడీఎస్ నోడల్ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
చేనేత క్లస్టర్ ప్రహరీ
పనుల పరిశీలన
సిద్దవటం: మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీలోని ఎస్‌కేఆర్ నగర్‌లోని చేనేత క్లస్టర్ ప్రహరీ పనులను బుధవారం హౌసింగ్ పీడీ రాజారత్నం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆన్‌లైన్ టెండర్ ద్వారా రూ. 49 లక్షలకు బద్వేల్‌కు చెందిన ఓబుల్‌రెడ్డి పనులు చేయడానికి టెండర్ దక్కించుకున్నారన్నారు. చేనేత క్లస్టర్ చుట్టూ ప్రహరీ, బిల్డింగ్ పనులు, టాయిలెట్ గదులు, మెయిన్‌టెనెన్స్ పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. స్థానిక కమిటీ సభ్యుడు గంజి సుబ్బరాయుడు, హౌసింగ్ ఏఈ చెన్నయ్య పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యంతో
అధిక దిగుబడులు
నందలూరు: ప్రకృతి సేద్యం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులను పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పేర్కొన్నారు. మండలంలోని లేబాక మంగమాంబపురంలో బుధవారం పొలం పిలు స్తోంది కార్యక్రమం నిర్వహించారు. పంటల బీమా గురించి రైతులకు తెలియజేశారు. రాజంపేట సహాయక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు మాట్లాడుతూ మామిడిలో తేనె మంచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మండల వ్యవసాయ అధికారి మల్లి కార్జున, జెడ్‌బీఎన్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment