దత్తత పొందడం ఒక వరం
రాయచోటి టౌన్: దత్తత పొందడం ఒక వరంలాంటిదని శిశుగృహ మేనేజర్ ఆర్. సుప్రియ అన్నారు. బుధవారం రాయచోటి రాజుల కాలనీలోని మండల సమాఖ్య భవనంలో జిల్లా శిశుగృహం ప్రత్యేక దత్తత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసోత్సవం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 0–6 సంవత్సరాల మధ్య ఉండి అనాథలుగా మారిన చిన్న పిల్లలను దత్తత చట్టపరంగా ఇస్తామన్నారు. అలాంటి పిల్లలను దత్తత తీసుకొన్న వారు వారి ఆలనా – పాలన చూసుకొంటారని తెలిపారు. అలాగే ఎక్కడైనా అనాథలుగా మారిన పిల్లలు ఉన్నట్లు కానీ, తమకు పిల్లలు వద్దు అని, వదిలించుకోవాలనుకునే ఆలోచన ఉన్న వారు ఎవరైనా 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే అనధికారికంగా దత్తత తీసుకొన్నట్లు తెలిసినా ఈ నంబర్‌కు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం పీవో –ఎన్‌ఐసీ బి. వెంకటరవికుమార్, ఏపీఎంఎం. శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
24న రాష్ట్రస్థాయి ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్‌హాల్‌లో ఈనెల 24వ తేదీ రాష్ట్రస్థాయి ఓపన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి బి. అనీస్‌దర్బారీ తెలిపారు. టోర్నీ విజేతలకు రూ.53 వేల మేర నగదు బహుమతులు, ట్రోఫీ లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 83412 55151 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment