ఆటోను ఢీకొన్న ఐషర్ వాహనం
చిన్నమండెం : కూలి పనులు ముగించుకుని మూడు చక్రాల ఆటోలో వెళ్తున్న కూలీలకు ఐషర్ వాహనం రూపంలో రోడ్డు ప్రమాదం జరగ్గా ఒకరు మృతి చెందారు. 12 మంది గాయపడిన సంఘటన చిన్నమండెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చిన్నమండెం మండలం కలిబండకు చెందిన దాదాపు 12 మంది కూలీలు బెస్తపల్లిలో టమాటా పని కోసం ఉదయం వచ్చి పని ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బెస్తపల్లె రోడ్డు క్రాస్, డాబా దగ్గరికి వచ్చేసరికి చిన్నమండెం నుంచి మదనపల్లి వైపు కోళ్లను తీసుకెళ్తున్న ఐషర్ వాహనం ఆటోను ఢీకొంది. బాలక లక్ష్మీదేవి(48) అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన లక్ష్మీదేవికి ఒక కుమారుడు ఉండగా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఒకే గ్రామానికి చెందిన 12 మంది రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కలిబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను రాయచోటికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నమండెం ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు..
ఒకరి మృతి, 12 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment