ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి
మదనపల్లె : ఇంజినీరింగ్ విద్యార్థిని కొందరు వ్యక్తులు అటకాయించి దాడి చేసిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. వలసపల్లె పంచాయతీ అరవవాండ్లపల్లెకు చెందిన మల్లికార్జున కుమారుడు రెడ్డికౌశిక్(21) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్ష రాసేందుకు అంగళ్లు సమీపంలోని విశ్వం కాలేజీకి వెళ్లాడు. పరీక్ష అనంతరం ద్విచక్రవాహనంలో స్నేహితులైన రఘు(21), వీరారెడ్డి(21)లతో కలిసి స్వగ్రామానికి వెళుతుండగా, మదనపల్లె సమీపంలోని అమ్మచెరువుమిట్ట వద్ద కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. అయితే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని రెడ్డికౌశిక్ వెళ్లిపోవడంతో మూడు ద్విచక్రవాహనాల్లో దాదాపు 10మంది వ్యక్తులు వెంబడించారు. బైపాస్‌రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రెడ్డికౌశిక్ ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. అడ్డగించిన వారిలో కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన హేమంత్, అతడి సోదరుడు వినయ్ ఉన్నారు. తమ చెల్లికి అసభ్యంగా ఎందుకు మెసేజ్ చేశావంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పేలోగానే, కర్రలతో రెడ్డికౌశిక్, అతడి స్నేహితులపై దాడి చేశారు. దాడిలో రెడ్డికౌశిక్ గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో పారిపోయి, తల్లిదండ్రులకు విషయం తెలిపి, జిల్లా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. దాడి ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిని హేమంత్, వినయ్‌ల తండ్రి రమేష్ దగ్గర నుంచి చూస్తూ ప్రోత్సహించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా రెండు నెలల క్రితం తనపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment