సిద్దవరంలో 150 మామిడి చెట్లు నరికివేత
పెనగలూరు : మండలంలోని సిద్దవరం రెవెన్యూ గ్రామంలో కొండా రామలక్షుమ్మ అనే మహిళకు చెందిన 150 మామిడి చెట్లను తిరుమలరాజుపేట హరిజనవాడకు చెందిన హరిబాబు సోమవారం నరికేవేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని సిద్దవరం రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 407లో కొండా రామల్‌క్షుమ్మకు 5 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఆమె ఎన్‌ఆర్‌ఈజీఎస్ బ్లాక్ ప్లాంటేషన్‌లో భాగంగా 2022 ఆగస్టులో మామిడి సాగు ప్రారంభించింది. 2023 నవంబర్ వరకు ఉపాధి పథకం కింద ఆమెకు లబ్ధి చేకూరింది. అనంతరం పలువురు ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అనే విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఆమెకు ఎలాంటి లబ్ధి అందలేదు. ఇదిలా ఉండగా తిరుమలరాజుపేటకు చెందిన హరిబాబు ఆ గ్రామ దళితులకు ఇళ్ల పట్టాలు కావాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాడు. దీంతో సర్వే నంబర్.407లో తాను సాగు చేసుకుంటున్న భూమిలోని మామిడి చెట్లను తిరుమలరాజుపేటకు చెందిన హరిబాబు మరికొందరితో నరికివేశాడని బాధితురాలు ఆమె బంధువు లేబాక శ్రీనివాసురెడ్డితో కలిసి పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి విచారణ చేస్తున్నట్టు తెలిపారు.
వీరబల్లిలో..
వీరబల్లి : మండలంలోని వీరబల్లి పంచాయతీ గొర్లపల్లికి చెందిన జక్కల వెంకటరమణకు సంబంధించిన భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్లు నరికారంటూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భూమిలో ఉన్న ఏడాది కాలం వయస్సు గల 60 మామిడి చెట్లను నరికి వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్‌ఐ మోహన్ నాయక్ తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment