రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేయాలి
రాయచోటి అర్బన్ : అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అందజేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సీపీఐ నాయకులతో కలిసి డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె మండలంలోని పింఛా జలాశయం మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న వెలిగల్లు జలాశయం కాలువ పనులను వూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్.నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధీర్, నాయకులు మురళి, జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment