ప్రమాదంలో గాయపడిన ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి మృతి
మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మదనపల్లెలో జరిగింది. తమిళనాడు దిండిగల్ జిల్లా పెరియకోటకు చెందిన ఆర్ముగం కుమారుడు మారిముత్తు(33) పట్టణంలోని దేవతానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఇతడికి స్నేహతో వివాహం జరిగింది.
విధి నిర్వహణలో భాగంగా ఈనెల 17న ఫైనాన్స్ కంపెనీ వసూళ్లకు వెళ్లి, ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా, మదనపల్లె బైపాస్‌రోడ్డులోని రాయల్ అరేబియా హోటల్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన స్థానికులు గాయపడిన మారిముత్తును ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అయితే అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య స్నేహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment