రెవెన్యూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాం
రాయచోటి (జగదాంబసెంటర్) : రెవెన్యూ ఉద్యోగులకు ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పి.నరసింహకుమార్ అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని జిల్లాలోని గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి బ్రహ్మయ్య రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ జగశెట్టి సతీష్, జాయింట్ సెక్రటరీ రాఘవేంద్ర, వెంకటరమణలు రెగ్యులర్ వీఆర్ఏలతోపాటు రిక్రూట్మెంట్ వీఆర్ఏలను కలుపుకుని ఎన్నికలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ఆర్.చండ్రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.శంకరయ్య, జిల్లా సహా అధ్యక్షులుగా వై.రెడ్డిశేఖర్లను ఎన్నుకున్నారు. అదే విధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా బాలాజీ, నాగేశ్వర, రామలింగారెడ్డి, శ్రీనివాసులు, జిల్లా ట్రెజరర్‌గా భారతి, జిల్లా జాయింట్ సెక్రటరీలుగా నరేష్, బుడాన్బాషా, రామాంజులమ్మ, అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికై న కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment