వ్యాధుల నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్‌ల పాత్ర కీలకం
రాయచోటి అర్బన్: వ్యాధుల నిర్థారణలో ల్యాబ్‌టెక్నీషియన్‌లే కీలకమని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య అన్నారు. బుధవారం స్థానిక ఎన్‌జీఓ సభాభవనంలో ల్యాబ్‌టెక్నీషియన్‌లకు ఒక్కరోజు రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ పోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డెంగీ, షుగర్, మలేరియా, టైఫాయిడ్, హెచ్‌బి1 ఇతర రకాల పరీక్షలన్ని నిర్వహించి అప్పటికప్పుడే ఫలితాలను అందజేయాలన్నారు. కడప మలేరియా అధికారిణి మనోహరమ్మ మాట్లాడుతూ ల్యాబ్‌టెక్నీషియన్‌లు రికార్డులన్నింటినీ ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. ట్రైనింగ్ అధికారిణి లక్ష్మిసుభద్ర, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక్కరోజు శిక్షణకు హాజరైన ల్యాబ్‌టెక్నీషియన్‌లకు గురువారం నుండి మూడు విడతలుగా అర్బన్‌హెల్త్ సెంటర్‌లో ప్రాక్టికల్ వర్క్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్ అధికారులు ప్రసాద్‌యాదవ్, జయరామయ్య, జయంద్ర, ఖలీల్, ముజీబ్, దాస్, శ్రీను, కృష్ణమ్మలతో పాటు పలువురు ల్యాబ్‌టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment