క్షేత్రస్థ్ధాయిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలి
రామాపురం: ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూములు, ఇతర రెవిన్యూ సేవలు, అపార్ ఐడీ జనరేషన్, హౌసింగ్ జియో ట్యాగింగ్, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ తదితర అంశాలలో రెవిన్యూ , ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్‌పై అధికారులతో సమీక్షించి, పనుల్లో వేగం పెంచాలని, పురోగతిని మెరుగుపరచాలన్నారు. ఎన్‌పీసీఎల్‌తో బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్‌పై సమీక్షిస్తూ గువ్వలచెరువు, సరస్వతిపల్లె, బైరెడ్డిగారిపల్లెలో ప్రగతి బాగుందన్నారు. మండలంలో గృహ నిర్మాణాల పురోగతిని మెరుగుపరచాలని.. రుణాలు అవసరమైతే మంజూరు చేయాలని డీఆర్‌డీఏ ఏపీఎంలను ఆదేశించారు. ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ ఉండాలని తహశీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఇంజినీర్లను ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమంలో పనులు పూర్తి చేయాలన్నారు.
పిల్లల హాజరు అప్‌లోడ్ చేయాలి
మండలంలోని సూర్యనారాయణపురం మండల పరిషత ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల అంగన్‌వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లల రోజువారి హాజరు నోట్ క్యామ్‌లో అప్‌లోడ్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీసీ రోడ్ల పరిశీలన..
కడప – రాయచోటి ప్రధాన రహదారిలో చిట్లూరు వద్ద ప్రధాన రహదారి నుండి ఆదర్శ పాఠశాల వరకు రూ.14 లక్షల అంచనాతో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్డును పరిశీలించారు.
మెరుగైన వైద్య సేవలు అందించండి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మందుల కొరతపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
● కార్యక్రమంలో డ్వామా, హౌసింగ్, డీఆర్‌డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహశీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చామకూరి
సర్వేరాళ్లపై బొమ్మలు తొలగించాలి
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుడ్లవారిపల్లి గ్రామంలో సర్వే రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మలు, అక్షరాలు చెరిపి వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ చామకూరి శ్రీధర్ బుధవారం పరిశీలించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఆయన లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూములు, రెవె న్యూ సేవలు, అపార్ ఐడీ జనరేషన్, హౌసింగ్, జియో ట్యాగింగ్, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ తదితర అంశాలలో రెవెన్యూ అధికారులతో, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో సమీ క్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులలో పురోగతి సాధించాలన్నారు. విద్యార్థుల అపార్ ఐడీ నమోదులో వేగం పెంచాలన్నారు. ఆధార్ కేంద్రాలను తహశీల్దార్, ఎంపీడీఓలు తనిఖీ చేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా, హౌసింగ్, డీఆర్‌డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహశీల్దార్, ఎంపీడీఓ, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment