యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలి
రాయచోటి అర్బన్ : జిల్లాలో వీఓఏ (యానిమేటర్లు) తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాణెమ్మ, జి.రెడ్డెప్ప ప్రభుత్వాన్ని కోరారు. యానిమేటర్ల తొలగింపును నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. కనీస నిబంధనలు, పద్ధతులు పాటించకుండా తమను తొలగిస్తుంటే సెర్ప్, డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం నాయకులు సుబ్రమణ్యం, క్రిష్ణమ్మ, పరంజ్యోతి, రమణారెడ్డి, శ్వేత, సుమతి, నిర్మల, రాజగోపాల్, నాగసుబ్బయ్య, శ్రీరామిరెడ్డి, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment