రక్షకుడు ఉదయించాడు
రక్షకుడు ఉదయించాడు.. ప్రపంచ మానవాళి అశాంతితో బాధపడుతున్న వేళ.. శాంతి సమాధానాలిచ్చేందుకు ఆయన అరుదెంచాడు.. పాపులను కరుణించే రక్షక్షుడిగా పశువుల పాకలో జన్మించాడు.. ప్రేమ, శాంతి, కరుణలను ఇంటింటా కాంతి దీపాలుగా వెలిగించాడు.. ఆ త్యాగమూర్తి రాకను లోకం పరవశంతో స్వాగతిస్తోంది.. నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లా అంతా పండుగ వాతావరణం నెలకొంది.
సాక్షి, రాయచోటి: మెత్తగా కురుస్తున్న మంచు...ఆహ్లాదకరమైన వాతావరణం...మంద్రంగా చర్చి గంటల శబ్దాలు. ఏసయ్య రాకడను తెలుపుతూ ఇంటింటా వెలుగుతున్న క్రిస్మస్ స్టార్లు....పిల్లలకు క్రిస్మస్ తాతలు బహుమతులు ఇస్తున్న దృశ్యాలు...మనసంతా క్రీస్తుపై నిలిపి విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు..నోరూరించే కేకులు... వెరసి విశ్వాసుల్లో ఆనందం. మనసు నిండా ఉత్సాహం. బుధవారం అర్థ రాత్రే పలు చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి.
తళుక్కుమన్న కాంతులు..
క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు క్రైస్తవ లోకం సిద్ధమైంది. దాదాపు పదిరోజుల ముందు నుంచే పండుగ హడావుడి ప్రారంభమైంది. చర్చిలను నూతన రంగులతో అందంగా రూపుదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలు అలంకరించారు. క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటూ రంగురంగుల కాంతులు చిమ్మే క్రిస్మస్ స్టార్లను వెలిగించారు. మదనపల్లెలోని జేసీఎం చర్చి, తిరుపతిరోడ్డులోని సెయింట్‌లూక్ చర్చి, బెంగళూరురోడ్డులోని ఆరోగ్యమాత చర్చి, ౖరైల్వేకోడూరులోని సెయింట్ లూథరన్ చర్చి, పీలేరులోని స్టీన్‌పౌల్స్ చర్చితోపాటు జిల్లాలోని తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, సుండుపల్లె, ఓబులవారిపల్లె, చిట్వేలి తదితర ప్రాంతాల్లోని ప్రముఖ చర్చిల్లోనూ క్రిస్మస్ పండుగ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి.
నేడు క్రిస్మస్ పర్వదినం
చర్చిల్లో మొదలైన ప్రార్థనలు
Comments
Please login to add a commentAdd a comment