●ముందస్తు ప్రార్థనలు
సాక్షి కడప: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి రోజు జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అనునిత్యం ప్రజలతో.. ప్రజా సమస్యలతో తీరికలేకుండా గడిపే జననేత వైఎస్ జగన్ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలివిడిగా తిరిగారు. సరదాగా బంధువులతో నవ్వుతూ, నవ్విస్తూ ఆనందంగా కనిపించారు. ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగకు ముందురోజు ఇడుపులపాయలోని ఓపెన్ చర్చి ప్రాంగణంలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులందరూ కలవడం పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా ఇక్కడ అందరూ కలిసి క్రిస్మస్ ముందస్తు ప్రార్థనలు నిర్వహిస్తారు. మంగళవారం చుట్టూ ప్రకృతి రమణీయతను పంచుతున్న కొండలు...ఆహ్లాదాన్ని పంచే వాతావరణం.. పచ్చని చెట్ల మధ్యన కుటుంబ సభ్యులందరూ కలిసిన క్రిస్మస్ పండుగ వేళ..ఆద్యంతం చిరునవ్వుల నడుమ.. ఒకరినొకరు పలుకరింపులు.. క్రిస్మస్ శుభా కాంక్షలు ఆత్మీయంగా గడిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబీకులతోపాటు బంధువులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా ఆయన కూడా అందరితో కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తల్లి వైఎస్ విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్‌ను ఆప్యాయంగా ముద్దాడగా, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ జగన్‌ను దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు చేరుకోగానే నేరుగా వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో మమేకం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతలతోపాటు ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఇడుపుల పాయలో కలిశారు. ఇడుపులపాయలోని సమాధి ఘాట్ ప్రాంతంతోపాటు గెస్ట్‌హౌస్ వద్ద మాజీ ముఖ్యమంత్రిని కలిశారు. ఇక కడపకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మాజీ సీఎంను కలిసి చర్చించారు. కడప అభివృద్ధితోపాటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌తో ఫొటోలు తీసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాజీ సీఎం పక్కనే ఉంటూ ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సింగారెడ్డి సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు బండి నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు నాగిరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి అధినేతను కలిసిన వారిలో ఉన్నారు.
అడుగడుగునా ఆత్మీయత
ఇడుపులపాయ నుంచి వేంపల్లెకు వెళుతుండగా దారి మధ్యలో జనాలు జననేతను పలకరించారు. వేంపల్లెలోని ఎస్‌ఎన్‌ఆర్ కల్యాణ మండపంలో వేముల మండలానికి చెందిన వెన్నపూస వెంకట్రామిరెడ్డి కుమారుడు వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవురులు పురుషోత్తంరెడ్డి, సాహితీరెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి మహిళలతో మాట్లాడారు.అనంతరం వేంపల్లె నుంచి పులివెందులకు వెళుతున్న వైఎస్ జగన్‌ను దారి మధ్యలో రాత్రిని కూడా లెక్క చేయకుండా జనాలు పలకరించారు.
నాన్నకు ప్రేమతో....
అక్కడ అడుగుపెడుతూనే
ఆయన కళ్లు చెమ్మగిల్లాయి..
అక్కడికి రాగానే
భావోద్వేగాలేవో కదలాడాయి..
తెలియకుండానే ఓ చేయి
తన గుండెలపై చేరింది..
మరో చేయి సమాధిని తాకింది...
మనిషిలో మౌనం..
మనసులో ధ్యానం రాజ్యమేలింది..
వైఎస్‌ఆర్ ఘాట్‌లో మహానేత వైఎస్సార్‌కు నివాళి అర్పించిన క్షణంలో
జననేత వైఎస్ జగన్‌లో కనిపించిన భావాలివి.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా..
కోట్లాదిమంది ప్రేమా.. ఆప్యాయతలు
తనకందించిన నాన్నను
మనసారా స్మరించుకున్నారు..
కుటుంబీకులు, బంధువులతో కలివిడిగా మాజీ సీఎం వైఎస్ జగన్
ఇడుపులపాయలోని ఓపెన్ చర్చి వద్దప్రత్యేక ప్రార్థనలు
అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్దనివాళులర్పించిన మాజీ సీఎం
ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ..అడిగిన వారికి సెల్ఫీ ఇస్తూ..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మేయర్, మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ నేతలు, కార్పొరేటర్లతో ఇష్టాగోష్టి
వేంపల్లెలో నూతన జంటకు ఆశీర్వాదం
పులివెందులకు వెళ్లే దారి పొడవునా రాత్రి సమయంలోనూ ప్రజల పలకరింపు
ఇడుపులపాయలోని ఓపెన్ ఎయిర్ చర్చిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ ముందస్తు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మతోపాటు సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష అలాగే దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, కుమారులు వైఎస్ అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ ఆనంద్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్ జోసెఫ్ రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, సోదరులు, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, యువరాజ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment