ఆల్ ఇండియా క్యారం పోటీలకు అంపైర్‌గా కృష్ణయ్య
నందలూరు: ఆలిండియా క్యారమ్స్ పోటీ లకు అంపైర్‌గా ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లా నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూరే కృష్ణయ్య ఎంపికయ్యారు. జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు నెల్లూరులో నిర్వహించనున్న ఆలిండియా క్యారమ్స్ పోటీలకు ఈయన అంపైర్‌గా వ్యవహరించనున్నట్లు ఏపీ స్టేట్ క్యారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్‌కే జలీల్, కడప జిల్లా క్యారమ్స్ అసోసియేషన్ చైర్మన్ పోలంకి గణేష్‌బాబు తెలిపారు. జిల్లా నుంచి జాతీయస్థాయి అంపైర్‌గా ఎంపికవడం పట్ల అభినందనలు తెలిపారు.
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
సిద్దవటం: వైఎస్‌ఆర్ జిల్లా అధికారి సూచనల మేరకు సిద్దవటం మండలంలో 20 వేల మొక్క లు నాటాలనే లక్ష్యంగా నర్సరీ ఏర్పాటు చేస్తామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. శుక్రవారం ఆమె ఇక్కడ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మొక్కలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ పొలాల్లో , ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు విరివిగా నాటాలన్నారు.
ఘనంగా గంధ మహోత్సవం
సిద్దవటం: మండలంలోని మాచుపల్లె గ్రామ సమీపంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలి దర్గాలో శుక్రవారం రాత్రి గంధం మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంధాన్ని పూల చాందినిలో పకీర్ల మేళ తాళాలతో, బ్యాండ్ వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపుంగా తీసుకెళ్లారు. గంధం దర్గాచేరిన తరువాత ఫాతేహా నిర్వహించారు.కార్యక్రమంలో మాచుపల్లె గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్: వెద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య తెలిపారు. 15 ఖాళీలు ఉన్నాయని.. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాను సి ఎఫ్ డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తులను నిర్దేశించిన రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికెట్లను జతపరచాలని తెలిపారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 4 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కడప పాత రిమ్స్ లో గల వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
ప్రజల్లో న్యాయవిజ్ఞానం
పెరిగేలా కృషిచేయాలి
రాయచోటి అర్బన్: ప్రజల్లో న్యాయవ్యవస్థ, రాజ్యాంగం, చట్టాల పట్ల పరిజ్ఞానం పెరిగేలా భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) కృషిచేయాలని రాయ చోటి 5వ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్‌కుట్టి అన్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన ఐఏఎల్–2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదే శానుసారం న్యాయవిజ్ఞాన సదస్సులు దేశవ్యాప్తంగా జరుగతున్నాయన్నారు.అయినప్పటికీ ప్రజల్లో చట్టాలపట్ల, రాజ్యా ంగ పట్ల మరింతగా విజ్ఞానం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
● భారత రాజ్యాంగం, చట్టాల గురించి ప్రజలందరికీ వివరించేందుకు భారత న్యాయవాదుల సంఘం వచ్చేవారం నుంచి చైతన్యసదస్సులను నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట ఈశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆనంద్‌కుమార్, రెడ్డియ్యలు అన్నారు. కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ అధ్య క్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి రెడ్డెయ్య. సహాయకార్యదర్శి డి.నాగముని, పీపీ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment