‘స్టాఫ్ నర్స్’ నియామకాలకు శ్రీకారం
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 (రాయలసీమ జిల్లాలు) పరిధిలో ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వచ్చిన తొలి నోటిఫికేషన్ ఇదే. కాగా అంతకుముందు ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రధానంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌ల రిక్రూట్‌మెంట్ పెద్ద ఎత్తున జరిగింది. దీంతో వందలాది మంది అర్హులైన నిరుద్యోగులు స్టాఫ్ నర్స్‌లుగా ఉద్యోగాలు పొందారు.
జోన్–4 పరిధిలో 600కు పైగా
‘స్టాఫ్ నర్స్’ ఖాళీలు...
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జోన్–4 పరిధిలోని రాయలసీమ ప్రాంత జిల్లాల పరిధిలో దాదాపు 600 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు గుర్తించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో నియామకాలకు అడ్డుకట్ట పడింది. దీంతో అర్హులైన వారు ఆందోళనలో పడ్డారు. తాజాగా కూటమి ప్రభుత్వం కేవలం 150 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. అర్హులైన వారు ఈ నెల 3వ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు విధానం ఇతర పూర్తి వివరాలకు సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. కాగా అభ్యర్థుల నుంచి దాదాపు 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో 1,550పైగా నియామకాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ అత్యంత బలోపేతంగా మారింది. వెల్లువ లా వివిధ కేడర్‌లకు సంబంధించిన నియామకాలు జరిగాయి. ఎంతలా అంటే ఎప్పటికప్పుడు ఖాలీలను భర్తీ చేస్తూ వచ్చారు. దీంతో అర్హులైన వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభించింది. కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో రాయలసీమ జిల్లాల నుంచి కేవలం స్టాఫ్ నర్స్‌ల నియామకాలు కేవలం రెండు నోటిఫికేషన్‌లకు గాను దాదాపు 1,550 మందికి పైగా ఉద్యోగాలు పొందడం విశేషం.
వైద్య ఆరోగ్య శాఖజోన్‌్–4లో నోటిఫికేషన్
17వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
పక్కాగా ఎంపిక ప్రక్రియ
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 150 మంది స్టాఫ్ నర్స్ నియామకాల కోసం చర్యలు చేపడుతున్నాం. అర్హులకు ఉద్యోగాలు వచ్చేలా పటిష్టవంతంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపడుతున్నాం. ఈ నియామకాల ద్వారా వైద్య విధాన పరిషత్ తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపికై న స్టాఫ్ నర్స్ లను నియమిస్తాం.
– డాక్టర్ రామ గిడ్డయ్య, రీజనల్ డైరెక్టర్,
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment