బి.కొత్తకోట: జిల్లాలో కరువు పరిస్థితులతో అల్లాడిపోతున్న రైతుల పరిస్థితులను పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర కరువు బృందం పర్యటన ముచ్చటగా మూడు గంటలే సాగనుంది. కేంద్రం నుంచి వస్తున్న బృందం పంట పొలాలను చూస్తారు, సాయం చేస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నిరాశే మిగలనుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గత ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలను రైతులు నష్టపోయారు. ప్రభుత్వం19 మండలాల్లో కరువు నెలకొందని ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కరువు బృందం పర్యటన కేవలం మూడు గంటలు మాత్రమే సాగనుండటం గమనార్హం. బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ సమీపంలోని తుమ్మనంగుట్ట గ్రామంలో పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే 7న హార్సిలీహిల్స్‌కు చేరుకునే బృందం దూరం పర్యటించకుండా వారు బస చేసిన కొండకు ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో వ్యవసాయశాఖ ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకిస్తారు. తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాలను మూడు గంటల్లో ముగించాక బృందం బెంగళూరుకు తిరిగి వెళ్తుంది. ఈనెల7న ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి నేరుగా హార్సిలీహిల్స్ వచ్చి బస చేస్తారు. 8న టీమ్ లీడర్ అయిన పాలసీ, కోఆర్డినేషన్స్ విభాగం సంయుక్త కార్యదర్శి పెరిన్‌దేవి, సభ్యులైన డెప్యూటి డైరెక్టర్ సుప్రియా మాలిక్, నీతి అయోగ్ పరిశోధనా అధికారి అనురాధ బటనా, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం డిప్యూటీ అడ్వయిజర్ ఆశిశ్ పాండేలు తుమ్మనంగుట్టలో క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంట పొలాలను పరిశీలిస్తారు. తర్వాత తిరిగి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు. 9న సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్తారు.
7న కేంద్ర బృందం రాక
8న తుమ్మనంగుట్టలో పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment