రూ.26 వేల కోట్ల బకాయిలను చెల్లించాలి
రాయచోటి అర్బన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిం రూ.26వేల కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు సుబ్రమణ్యంరాజు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సాయి ఇంజినీరింగ్ కళాశాల సభా భవనంలో ఎస్‌టీయూ అన్నమయ్య జిల్లా శాఖ 78వ వార్షిక కౌన్సిల్ సమా వేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ వద్ద దాచుకున్న సొమ్మును పాలకులు ఖర్చు చేసేసి తిరిగి చెల్లించకుండా మొండి చేయి చూపిస్తుండడం దారుణమన్నారు. పలుమార్లు విన్నవించుకున్నా బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల గంగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పలురకాల యాప్‌ల నిర్వహణ భారంతో ఉపాధ్యాయులు బోధనకు దూరమై పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, పోకల మధుసూదన్ మాట్లాడుతూ బదిలీ చట్టం పారదర్శకంగా రూపొందించాలన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి సలహాలు, సూచనలు స్వీకరించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి రాజారెడ్డి, నేతలు వేణుగోపాల్‌రెడ్డి, గురుప్రసాద్, రవీంద్రనాథ్‌రెడ్డి, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment