ఏఐటీఎస్‌లో అట్టహాసంగా సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు
రాజంపేట : అన్నమాచార్య యూనవర్సిటీలో ఏఐటీఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి అన్నారు. సోమవారం తన చాంబర్‌లో తన సోదరుడు, ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డితో కలిసి ఆయన విలేకరలతో మాట్లాడారు. మూడు రోజుల పాటు ఏయూ క్యాంపస్‌లో ఏఐటీఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, అన్నమాచార్య యూనవర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజున మంగళవారం సాయంత్రం ఎంపీ మేడా రఘునాఽథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి, రాజంపేట సబ్‌కలెక్టర్ వైకోమానైదియాదేవి హాజరు అవుతారన్నారన్నారు. బుధవారం ఆరు వేల మంది విద్యార్థులతో ఐదు కిలోమీటర్ల పాటు రాజంపేటలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఉంటుందన్నారు. మత్తు మందులకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించే అద్భుతమైన కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పదం కదిలిపితే, అడుగువేస్తే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి కారణమవుతందన్నారు. రాజంపేటలో ఉదయం 7.30 గంటలకు యూనవర్సిటీ ప్రాంగణం నుంచి సమూహం కదిలి జనచైతన్యం కలిగిస్తుందన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రారంభించనున్నారన్నారు. ఇందులో అన్నమాచార్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సీ.రామచంద్రారెడ్డి, ఏయూ ప్రో–చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి పాల్గొనడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ర్యాలీలో సినీనటుడు కేవీప్రదీప్ పాల్గొంటారన్నారు. పెద్ద సామాజిక ప్రయోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే రోజు సాయంత్రం సీమలో వివిధ విభాగాలలో రాణించిన వారికి అన్నమాచార్య యూనివర్సిటీ అవార్డు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిండెంట్ జి.సతీష్‌రెడ్డిలు హాజరు కానున్నారన్నారు. మూడవ రోజున సాయంత్రం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చౌదరి, అబ్బవరం కిరణ్‌లు హాజరు కానున్నారని వెల్లడించారు. అన్నమాచార్య యూనవర్సిటీ ఆవిర్భావం, రాజంపేట ప్రాంతంలో ఉన్నత విద్యాభివృద్ధికి నిదర్శనమన్నారు.
ఏయూ క్యాంపస్‌లో మూడు రోజుల పాటు సంబరాలు
అన్నమాచార్య యూనవర్సిటీ
అవార్డులు పంపిణీ
అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment