జిల్లాకే ప్రథమం.. అన్నమాచార్య విశ్వవిద్యాలయం
రాజంపేట : జిల్లాకే ప్రప్రథమంగా అన్నమాచార్య విశ్వవిద్యాలయం(ఏయూ) ఏర్పాటైంది. దాదాపు 52 ఎకరాల్లో రాజంపేటలో ఏయూ ఏర్పాటు కావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నమాచార్య యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. గవర్నర్‌తోపాటు సినీ హాస్యనటుడు బ్రహ్మనందం, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌చౌదరి, యువనటుడు కిరణ్ అబ్బవరం పాల్గొంటారు. 1997లో అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటైంది. 1998లో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల ఆవిర్భవించింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో విద్యావేత్త చొప్పాగంగిరెడ్డి కళాశాలను తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్నమచార్య యూనివర్సిటీ మంజూరు అయింది. ఈ నెల 9న బీహార్ గవర్నరు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
అటానమస్.. న్యాక్ అక్రిడేషన్
వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ రావడం వల్ల మూడుసార్లు న్యాక్ అక్రిడేషన్, ఎన్‌బీఏ మూడుసార్లు దక్కించుకుంది. అటానమస్‌గా గుర్తింపు కడప, తిరుపతి, హైదరాబాద్‌లలో ఇంజినీరింగ్ కళాశాలల బ్రాంచీలను ఏర్పాటు చేశారు.
ఎందరో.. మరెందరో..
రాజంపేట ఏఐటీఎస్‌లో విద్యనభ్యసించిన సినీనటుడు అబ్బవరం కిరణ్, ప్రముఖ మెజీషియన్ మైనుద్దీన్‌తోపాటు ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. దేశ, విదేశాల్లో వేల సంఖ్యలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానికి, పోటీ పరీక్షలు, ఇతరత్రా పరీక్షలకు ఏఐటీఎస్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.
రాజంపేటలో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
వేలాది మంది విద్యార్ధులకు నాణ్యమైన విద్య
9న హర్యానా గవర్నర్ దత్తాత్రేయచే ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment