పదిలో ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలి
సంబేపల్లె : మార్చి నెలలో నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రదానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాదికారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
ఆలయ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
వీరబల్లి : ఆలయ భూములు ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా దేవదాయశాఖ అధికారి సి.విశ్వనాథ్ అన్నారు. గడికోటలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ గడికోట గ్రామంలో రాయచోటి వీరభద్ర స్వామి ఆలయానికి 179 ఎకరాల మాన్యాలు ఉన్నాయన్నారు. 44 ఎకరాలకు రెవెన్యూ రికార్డులు ఉన్నాయని, మిగిలిన 135 ఎకరాలకు రెవెన్యూ రికార్డులు లేవన్నారు. ఈ విషయంపై త్వరలో ఆరా తీస్తామన్నారు.కొన్నిచోట్ల దేవాలయ భూములను అనుభవిస్తూ కౌలు చెల్లించకుండా ఉన్నారని అలాంటి రైతులు వెంటనే దేవాలయాలకు కౌలు చెల్లించి మండల దేవదాయ అధికారుల నుంచి రశీదులు పొందాలన్నారు. అనంతరం తహసీల్దార్ శ్రావణితో కలిసి ఆలయ భూముల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర ఆలయ ఈఓడీఓ రమణారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment