రాజంపేట : పాత్రికేయులను బెదిరిస్తే ఉపేక్షించేదిలేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు. బుధవారం రాజంపేటకు వచ్చిన ఎస్పీని స్ధానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో స్థానిక విలేకరులతో కలిసి బాధితుడు కూరాకు శ్రీను అనే విలేకరి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. సోమవారం పుల్లంపేట మండలం రామక్కపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యనాయుడు(మణి) అనే వ్యక్తి తనను బెదిరించాడని రాజంపేట ఎస్‌డీపీఓ సుధాకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందలేదన్నారు. వెంటనే ఎస్పీ సానుకూలంగా స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని అక్కడే ఉన్న డీఎస్పీని ఆదేశించారు. ఎస్పీ వెంట రైల్వేకోడూరు సీఐ హేమసుందరం, మన్నూరు సీఐ అలీ, రూరల్ సీఐ రమణ, పలువురు ఎస్‌ఐలు ఉన్నారు.
హత్య కేసు కొట్టివేత
రాయచోటి టౌన్ :శిబ్యాల గ్రామం వైకుంఠ రాచపల్లి ఎర్రచెరువులో మేకలు మేపుతున్న మహిళ హత్య కేసును కోర్టు కొట్టి వేసింది. 2013లో ఈ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు ఎన్.సాంబశివ, ఎం. బాలాజీ, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బుధవారం ఈ కేసును ఐదవ జిల్లా జడ్జి కృష్ణ కుట్టిన్ కొట్టి వేసినట్లు ముద్దాయిల తరపు న్యాయవాది నాగముని తెలిపారు.
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
Comments
Please login to add a commentAdd a comment