స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ అధ్యక్షుడిగా శేషారెడ్డి
మదనపల్లె : మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్, ఎఫ్–100 నూతన అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన న్యాయవాది వై.వి.శేషారెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. బుధవారం సీటీఎం యూనియన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జి.భాస్కరరెడ్డి మాట్లాడుతూ యూనియన్ గౌరవాధ్యక్షుడు నందగోపాల్ ఆకస్మిక మరణంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా న్యాయవాది వై.వి.శేషారెడ్డిని మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా సమావేశానికి హాజరైన 210 మంది కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.
మళ్లీ కనిపించిన చిరుతపులి
రామసముద్రం : రామసముద్రం మండలంలో తిరిగి చిరుత పులి ప్రజల కంట పడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గుంతయంబాడీకి చెందిన పెద్ద చెరువు కట్టలో వై. కురప్పల్లి గ్రామానికి చెందిన వెంకట్రమణకు బుధవారం ఉదయం చెరువు కట్టపై చిరుత కనిపించింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియడంతో గుంతయంబాడీ, వై. కురప్పల్లి, గుండ్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని గాలించారు. విషయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చిట్టిబాబుకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. ప్రజలు పశువులు, మేకలు తోలుకొని పెద్ద చెరువులోకి వెళ్లవద్దని సూచించారు.
నేడు అన్నమాచార్య
విశ్వవిద్యాలయం ప్రారంభం
రాజంపేట : అన్నమాచార్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవాన్ని గురువారం అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం, యువనటుడు కిరణ్ అబ్బవరం, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చౌదరి తదితరులు పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment