ప్రైవేటీకరణ చేసేందుకే వైద్యసేవలు నిర్వీర్యం
మదనపల్లె : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మదనపల్లె మెడికల్ కాలేజ్ రెండింటినీ ప్రైవేటీకరణ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఆస్పత్రిలో వైద్యసేవలు నిర్వీర్యం చేస్తున్నారని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ ఆరోపించారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు కార్పొరేట్, మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు, విద్యార్థులు స్థానికంగా వైద్యవిద్యను అభ్యసించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంటరీ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. అందులో భాగంగా రాజంపేట పార్లమెంట్‌కు మంజూరైన మెడికల్ కాలేజీని మదనపల్లెలో ఏర్పాటు చేసేలా ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు.
ఈ విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాలేజీ నిర్మాణ పనులు నిలిపివేసి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించిందన్నారు. ఏ సదుద్దేశంతో అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మదనపల్లె మెడికల్ కాలేజీని, జిల్లా ఆస్పత్రిని ఆధునీకరించిందో ఆ ఉద్దేశం నీరుగారిపోతోందన్నారు. ప్రజల పక్షాన పోరాటా నికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు.
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment