700 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
రాయచోటి : రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని ఓ రైస్ మిల్లులో తరలింపునకు సిద్ధంగా ఉన్న 350 క్వింటాళ్ల (700 ప్యాకెట్లు) పీడీఎఫ్ బియ్యాన్ని స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి గుర్తించారు. పట్టుబడిన బియ్యం సమాచారాన్ని జేసీ ఆదర్శ రాజేంద్రన్‌కు తెలిపారు. రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా అక్రమార్కులు అక్రమ రవాణాను ఆపడం లేదు. రైస్ మిల్లుల కేంద్రంగా జరుగుతున్న ఈ గుట్టును రట్టు చేశారు.
రాయచోటిలో మంగళవారం అర్ధరాత్రి పట్టుబడిన 700 ప్యాకెట్ల బియ్యం బస్తాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అర్బన్ ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు. పట్టుబడిన బియ్యం ఎవరివి అనే విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదన్నారు. విచారణలో నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుబడిన బియ్యాన్ని ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment