సీమకే తలమానికం అన్నమాచార్య విశ్వవిద్యాలయం
రాజంపేట : రాయలసీమకే అన్నమాచార్య విశ్వవిద్యాలయం తలమానికంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఏయూ క్యాంపస్‌లో రెండవ రోజు ఏర్పాటు చేసిన ఏఐటీఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏయూ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి, ప్రో చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా ఏఐటీఎస్ ముందుకు వచ్చిందన్నారు. రాజంపేట ప్రాంతం విద్యాహబ్‌గా మారేందుకు ఏయూ మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పట్టుదల, నైతిక విలువలు పెంపొందించేందుకు ఏయూ వేస్తున్న అడుగులు అద్భుతనీయమన్నారు. ఏయూ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో రాణించిన 25 మంది ప్రముఖలకు ఏయూ రెసోనన్స్ అవార్డులను అందజేసి సత్కరించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏయూ ప్రో చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ అన్నమాచార్య యూనివర్సిటీ కేవలం విద్యకే పరిమితం కాకుండా సామాజిక సేవలో కూడా ఏయూ ముందుకు దూసుకెళుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్.మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నమాచార్య కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభం
ఏయూలో అన్నమాచార్య కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ప్రారంభించారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖవారిచే అనుమతించిన రేడియో స్టేషన్ (98.6 మెగాహెడ్జ్‌స్’)ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
అవార్డులు అందుకున్నది వీరే..
జేన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ సుదర్శన్, వైవీయూ వైస్ చాన్సలర్ డాక్టర్ కృష్ణారెడ్డి, పీవీకేకే గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రాయలసీమ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ కొండారెడ్డి, కేఎస్‌ఆర్‌ఎం గ్రూపు కరస్పాండెంట్ కె.రాజేశ్వరి, ఎన్‌బీకేఆర్‌ఐఎస్‌టీ డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, ఉన్నతమైన కంపెనీ హెచ్‌ఆర్‌లు కీర్తినాయక్, టెక్ మహేంద్ర అబ్దుల్లారహీం, ఐటీసీ ఇన్ఫోటెక్ ఎండీ జాషువా డేవిడ్, సినీ ప్రముఖులు సోమసుందరం, లాస్య, జయచంద్ర, వివిధ రంగాలలో అత్యుత్తమ స్ధాయిలో నిలిచిన ఏఐటీఎస్ పూర్వ విద్యార్థులు అన్నమాచార్య యూనివర్సిటీ రెసోనన్స్ అవార్డులను అందుకున్నారు.
రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment