అధ్యయన సామగ్రి సద్వినియోగం చేసుకోండి
రాయచోటి టౌన్ : అధ్యయన సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్‌టీయూ) ఆధ్వర్యంలో రూపొందించిన పదవ తరగతి అధ్యయన సామగ్రిని, డైరీని అన్నమయ్య జిల్లా డీఈఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన భావనలతో కూడిన ఈ అధ్యయన సామగ్రి 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమైన ఉత్తర్వులతో కూడిన డైరీ ఉపాధ్యాయులకు సేవా నిబంధనలపై అవగాహన పెంపొందించుకునేందుకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీవైఈఓ శివప్రకాష్‌రెడ్డి, సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తక రచయిత మడితాటి నరసింహారెడ్డి, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరాజు, జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మురళీకుమార్, సీసీఎస్ కన్వీనర్ గోపికృష్ణ, జిల్లా మైనార్టీ కన్వీనర్ అంజద్‌బాషా, నాయకులు వాసుదేవరెడ్డి, నాగరాజు, రమణయ్య, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment