అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పోరుమామిళ్ల : మండలంలోని దమ్మన్నపల్లెకు చెందిన తోట రామాంజనేయులు (44) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. కొండారెడ్డికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేసేందుకు రూ.5 లక్షలు అప్పు అయింది. కుమారునికి వివాహం కాలేదు. ఆయనకు ఎ.1–48 సెంట్లు పొలం ఉండగా అందులో వరి సాగు చేస్తున్నాడు. 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయగా రూ. 8 లక్షలు అప్పు అయింది. మొత్తం రూ. 13 లక్షలు తీర్చే దారి కనిపించక చనిపోవాలని భావించాడు. గత సంవత్సరం డిసెంబర్ 31న పురుగుల మందు తాగాడు. ఐదు రోజులుగా కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ సమాచారం ఆదివారం ఉదయం పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌కు అందడంతో ఎస్‌ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment