నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్
మదనపల్లె : బస్సులోని ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైనును మహిళా కండక్టర్ నిజాయితీతో బాధితుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటకు చెందిన శివకుమార్ సొంత పనుల నిమిత్తం మదనపల్లెకు వచ్చారు. తిరిగి మదనపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సులో రంగంపేటకు బయలుదేరి వెళ్లాడు. బస్సు దిగే క్రమంలో తన బ్యాగును బస్సులోనే మరచిపోయాడు. ఇంటికి వెళ్లాక బ్యాగు బస్సులో మరచిపోయినట్లు గుర్తించిన శివకుమార్ హుటాహుటిన తిరిగి మదనపల్లెకు వచ్చి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే బస్సులో శివకుమార్ మరచిపోయిన బ్యాగును గుర్తించిన ఆర్టీసీ కండక్టర్ గిరిజమ్మ, అధికారులకు సమాచారం తెలిపి, టూటౌన్ పోలీసులకు బ్యాగును అప్పగించింది. అందులో రూ.2.50 లక్షల విలువ చేసే బంగారు చైను ఉండటంతో పోలీసులు బాధితుడికి సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించి, బ్యాగు, చైనును కండక్టర్ గిరిజమ్మతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు, ఆర్టీసీ అధికారులు కండక్టర్ గిరిజమ్మ నిజాయితీని అభినందించారు. కార్యక్రమంలో టూటౌన్ ఏఎస్‌ఐ వెంకటరమణ తదితరులు ఉన్నారు.
రూ.2.50 లక్షల విలువైన
బంగారు చైను అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment