ఇసుక నిల్వలపై దొంగలు పడ్డారు!
బి.కొత్తకోట/కురబలకోట: తంబళ్లపల్లె నియోజక వర్గంలో నాలుగు మండలాల ప్రజలకు తాగునీరు, 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ముది వేడు రిజర్వాయర్ పనులను టీడీపీ నేతలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు వేసి పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ పనుల కోసం కాంట్రాక్టు సంస్థ కురబలకోట మండలం ముదివేడు సమీపంలో చేపట్టిన రిజర్వాయర్ పనులకు భారీగా ఇసుక నిల్వలను సిద్ధం చేసింది. పనులు సాగుతుండగానే టీడీపీ నేతలు తమ ఉనికి కోల్పోతామన్న భయంతో ఎన్‌జీటీ ద్వారా పనులు అపివేయించారు. పనుల వ్యవహారం ఎన్‌జీటీ కేసు మేరకు ఇసుక, కంకర, షెడ్లు, వాహనాలు, యంత్రాలు ఏమున్నా అలాగే ఉంచేశారు. ప్రాజెక్టు పనులను అడ్డుకోవడమేకాక ఇసుక దోపిడీకి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవా రం ఈ ఇసుకను దోచుకునేందుకు కొందరు టీడీపీ నేతలు తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఉదయాన్నే మూడు టిప్పర్లు, ఒక జేబీబీని అక్రమంగా రిజర్వాయర్ వద్దకు పంపించారు. టిప్పర్లలో ఇసుకను నింపుతుండగా..అనుమతులు ఎవరిచ్చారని కాపలా సిబ్బంది డ్రైవర్లను ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించి బెదిరించారు. విషయాన్ని కాంట్రాక్టు సంస్థ ఉద్యోగుల దృష్టికి తేవడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో విష యం తెలుసుకున్న రైతులు టిప్పర్లు, జేసీబీని అడ్డుకున్నారు. రిజర్వాయర్ పనులకోసం భూములు కోల్పోయామని తమకు అందాల్సిన పరిహారం, ఇతర ప్రయోజనాలను ప్రభుత్వం అందించే వరకు ఇసుక, కంకరను తీసుకెళ్లనివ్వమని పట్టుబట్టారు. అప్పటికే కొన్ని టిప్పర్ల ఇసుక తరలిపోయింది. మిగిలిన టిప్పర్లు, జేసీబీ కదలకుండా రైతులు అడ్డుకున్నారు.
తరలించకుండా చర్యలు
రిజర్వాయర్ వద్దకు వచ్చిన తహసీల్దార్ తపస్వి, మైన్స్ అధికారి ఆర్.కుమార్, పోలీసులు ఇసుక నిల్వలను పరిశీలించారు. నిర్మాణ పనులు, ఇసుక నిల్వ లు ఎన్‌జీటీ కేసు పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశా రు. ఇసుకను ఎవరూ తరలించకుండా చర్యలు తీసుకుంటామని, కేసు ఉన్నంత వరకు ఇసుకను కాపాడే బాధ్యత తమదని చెబుతూనే ఇసుక కోసం వచ్చిన టిప్పర్లను పంపించేస్తామంటూ వెళ్లిపోయారు. కోర్టు కేసులోని ఇసుకను తరలించేందుకు అక్రమంగా వచ్చిన టిప్పర్లు, జేసీబీకి సంబంధించి ఎవరైనా ఉత్తర్వులు ఇచ్చారా, అనుమతి లేకుండా అక్రంగా ఇసుక తరలింపు ఎందుకు వచ్చారని అధికారులు కనీసం విచారణ కూడా జరపకనే వెనుదిరిగి వెళ్లారు.
ఉద్యోగికి బెదిరింపు
రిజర్వాయర్ వద్ద నిల్వ ఉన్న ఇసుకను తరలిపోకుండా అధికారులకు సమాచారం ఇచ్చారని కాంట్రాక్టు సంస్థకు చెందిన ఓ ఉద్యోగిని కొందరు ఫోన్‌లో బెదిరించారు. మా పనులకే అడ్డుపడ్తావా..నీ సంగతి చూస్తామంటూ బెదిరించారు.
సీజ్ చేయకుండా వదిలేశారు
రిజర్వాయర్ వద్ద ఇసుక పరిశీలనకు వచ్చిన అధికారులకు అక్కడే ఉన్న టిప్పర్లు, జేసీబీని చూశారు. కేసు పరిధిలో ఉన్న ఇసుకను తరలించకూడదని, ఇసుకను కాపాడతామని చెప్పిన అధికారులు వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. అనుమతి లేకుండా ట్రాక్టర్ ఇసుకను తరలిస్తేనే కేసులు నమోదయ్యాయి. అలా ంటిది ఎన్‌జీటీ కేసు పరిధిలోని ఇసుక నిల్వలను బహిరంగంగా తరలించుకునేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం, టిప్పర్లు, జేసీబీలను ఎందుకు సీజ్ చేయలేదో అధికారులే సమాధానం చెప్పాలి. వీటిని టీడీపీకి చెందిన కొందరు నాయకులు పంపించారని, వారి ఒత్తిళ్లతో చర్యలు లేకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఇసుకను దోచుకునేందుకు టీడీపీ నేతల ప్రమేయం ఉన్నందునే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సామాన్యు లు ఇసుకను తరలిస్తుంటే అధికా రులు ఇలానే వదిలేస్తారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తు న్నారు. టిప్పర్లు, జేసీబీ పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రిజర్వాయర్ వ్యవహరంలోనే చంద్రబాబుపై కేసు
ప్రతిపక్షనేతగా 2023 అగస్టు 4న కురబలకోట మండలం అంగళ్లకు వచ్చిన చంద్రబాబుపై కేసు నమోదైంది కూడా ముదివేడు రిజర్వాయర్ విషయంలోనే. ఆ రోజున.. టిడిపీ నేతలు కోర్టుకు వెళ్లి రిజర్వాయర్ పనులు నిలివేయించారని దీనిపై వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు అంగళ్లు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనలకు చంద్రబాబు కారణమని ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను మొదటి ముద్దాయి చేసారు. అప్పటినుంచి ఇసుక నిల్వలు అలాగే ఉండగా ఇప్పుడు అక్రమంగా తరలించుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు ఒడిగట్టారు.
ముదివేడు రిజర్వాయర్ పనుల కోసం భారీ నిల్వలు
ఆపై టీడీపీ నేతల ఎన్‌జీటీ కేసుతోఆగిన పనులు
ఇసుక తరలింపునకు 3 టిప్పర్లు, ఒక జేసీబీని పంపిన టీడీపీ నేతలు,
అడ్డుకున్న గ్రామస్తులు
ఆలస్యంగా స్పందించినరెవెన్యూ, మైన్స్, పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment