● మూన్నాళ్ల ముచ్చట
అట్లూరు: సంక్రాంతి నాటికి రోడ్లు ఎక్కడా గతుకులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏ నియోజకవర్గం నుంచి రోడ్లు బాగలేవని ఫిర్యాదులు రాకూడదని చెబుతూ.. దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించారు. అయితే బద్వేలు నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మరమ్మతులు(ప్యాచింగ్‌లు) మూన్నాళ్ల ముచ్చట అన్న చందంగా తయారయ్యాయి. కడప–బద్వేలు ప్రధాన రహదారికి అట్లూరు అటవీ ప్రాంతం నుంచి బద్వేలు మండలం నక్కలగండి వరకు లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల గుంతలకు ప్యాచులు వేశారు. అయితే కనీసం సంక్రాంతి వరకు కూడా పనులు నిలవలేదు. తారు లేచిపోయి గతుకులమయంగా మారింది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. నేతలు మాత్రం జేబులు నింపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment