విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
రాయచోటి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు.విద్యార్థులలో విద్యా ప్రమాణాల మెరుగు, సృజనాత్మకతకు నాణ్యమైన భోజనమే పునాది అని అన్నారు. శనివారం రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రారంభించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యాశాఖలో మార్పులు వచ్చాయని, అందులో భాగమే జూనియర్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ స్వయంగా భోజనాన్ని వడ్డించి కళాశాలలోనే భోజనం చేశారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి కృష్ణానాయక్, జిల్లా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగుల అనారోగ్య పింఛన్ల ధ్రువీకరణ ప్రక్రియ పక్కాగా జరగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పీడీడీఆర్‌డీఏ, వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జ్లిలాలో పింఛన్ల ధ్రువీకరణ ప్రక్రియకోసం 12 మందితో కూడిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ బృందానికి సహకారం అందించేందుకు డిజిటల్ అసిస్టెంట్లను కూడా ఏర్పాటు చేశామని జేసీ పేర్కొన్నారు. సోమవారం నుండి దృవీకరణ ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment