జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక
పీలేరు: అండర్ –12 ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టుకు పీలేరుకు చెందిన కె. హేమంత్ ఎంపికై నట్లు క్రికెట్ కోచ్ నాగరాజ తెలిపారు. శుక్రవారం వాల్మీకిపురం ఎస్‌సీఎస్ గ్రౌండ్‌లో నిర్వహించిన సెలక్షన్స్‌లో హేమంత్ ప్రతిభ చూపి జిల్లా జట్టుకు వికెట్ కీపర్‌గా ఎంపికై నట్లు చెప్పారు. హేమంత్ స్థానిక వీఎస్‌ఎన్ సిద్ధార్థ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. హేమంత్‌కు పాఠశాల కరస్పాండెంట్ మాధవి అభినందనలు తెలిపారు.
మల్లయ్య కొండపై మాజీ రాష్ట్రపతి మనవడు పూజలు
కురబలకోట: దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు టీఎన్.అభిరామిరెడ్డి దంప తులు శనివారం అంగళ్లు మల్లయ్యకొండపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
రైల్వేకోడూరు హోటల్ యజమానులకు నోటీసులు
రాయచోటి (జగదాంబసెంటర్): రైల్వేకోడూరు పట్టణంలోని హోటల్ యజమానులు భోజనం చేసే వారికి తాగునీరు కూడా అందించాలంటూ నోటీసులను జారీ చేసినట్లు జిల్లా ఆహార భద్రతా అధికారి కె.షమీమ్‌బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఓ హోటల్‌లో భోజనం చేసే వారికి తాగునీరు ఇవ్వడం లేదని, వాటర్ బాటిళ్లు కొనుక్కోవాలంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సంపద సృష్టికి గొప్ప ఆయుధం మేధో సంపత్తి
కురబలకోట: మేధో సంపత్తితో సంపదను సృష్టించవచ్చని న్యూఢిల్లీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం మేధో సంపత్తి హక్కులపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేధో సంపత్తి మనిషి తెలివి తేటలను సంపదగా మారుస్తుందన్నారు.వీటిపై లభించే హక్కులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందన్నారు. జయా ఐపీ వ్యవస్థాపకులు, న్యాయవాది స్వర్ణ శ్రీవాస్తవ మాట్లాడారు.
సాంకేతికతను అర్థం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు
రాయచోటి: అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను అర్థం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు మీదేనని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ అధ్యాపకులు జి వరప్రసాద్ అన్నారు. రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం నిర్వహించిన పైథాన్ ప్రోగ్రామింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. కళాశాలలో పైథాన్ ప్రోగ్రామింగ్‌పై రెండురోజుల వర్క్‌షాప్‌ను ఈనెల 3 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జి వరప్రసాద్ పైథాన్ ప్రోగ్రామింగ్ రంగంలో వృద్ధి చెందుతున్న ప్రాముఖ్యతను విద్యా ర్థులకు వివరించారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి శివశంకర్, ఈసిఈ హెడ్ చెన్నకేశవ ప్రసాద్, ఈఈఈ హెడ్ ఇందిర ప్రియదర్శినీలు పాల్గొన్నారు.
అటవీ సంరక్షణకు కృషిచేయాలి
రాజంపేట: కొత్త సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ పేర్కొన్నారు. శనివారం స్ధానిక జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి తమ విధులును సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ పురోగతి పరుగులు పెట్టించాలన్నారు. సమావేశంలో మదనపల్లె సబ్‌డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, రైల్వేకోడూరు సబ్‌డీఎఫ్‌ఓ సుబ్బారావు, చిట్వేలి ఎఫ్‌ఆర్‌వో ధీరజ్, రైల్వేకోడూరు ఎఫ్‌ఆర్‌ఓ శ్యామసుందర్, సానిపాయి రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి, బాలపల్లె రేంజర్ ప్రభాకర్‌రెడ్డి, మదనపల్లె రేంజర్ ప్రసాద్‌రావు, పీలేరు రేంజర్ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment