● నాణ్యతకు తిలోదకాలు
ప్రొద్దుటూరు: గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. ఎన్డీఏ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.800 కోట్లు మంజూరైనట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేకంగా రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టారు. కాంట్రాక్టర్లు పలు చోట్ల చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో పూడ్చిన చోట కంకర లేచిపోయి గుంతలు కనిపిస్తున్నాయి. గుంతలు చూసిన వారు ఔరా ఇదేమి చిత్రమని చర్చించుకుంటున్నారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ శాఖల అధికారులు ఈ పనులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment